పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించరు?: దుర్గేష్‌ | ysrcp leader kandula durgesh questioned pawan kalyan over ap cabinet expansion | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించరు?: దుర్గేష్‌

Published Tue, Apr 4 2017 2:06 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించరు?: దుర్గేష్‌ - Sakshi

పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించరు?: దుర్గేష్‌

రాజమండ్రి: ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ​ ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ఆర్‌ సీపీ నేత కందుల దుర్గేష్‌ సూటిగా ప్రశ్నించారు.  ప్రశ్నించడానికే ఏర్పడిన పార్టీ...రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.  

పార్టీ మారినవారికి కేబినెట్‌లో చోటు కల్పించడం దారుణమని దుర్గేష్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు నలుగురికి ఏపీ కేబినెట్‌లో చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు వారికి కీలక శాఖలు కేటాయించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement