
సాక్షి, గుంటూరు: రుషికొండ భవనాలకు అనుమతులున్నాయని స్పష్టమైంది. శాసన మండలిలో ఈ విషయాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. రుషికొండ పర్యాటక భవనాలకు సీఆర్‌జెడ్, జీవీఎంసీ అనుమతులు ఉన్నాయన్నారు.
కాగా, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని.. రండిచూసుకుందాం.. సిగ్గుందా అంటూ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫర్నిచర్‌తో కలిపి ఎస్‌ఎఫ్‌టీ 14 వేలు ఖర్చు చేశారన్నారు.
రుషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు. ఆ భవనాలన్ని బాగా కట్టారని సీఎం, డిప్యూటీ సీఎం లే చెప్పారు కదా.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి. అవి ప్రభుత్వ భవనాలు, వైఎస్ జగన్ సొంత భవనాలు కాదు కదా అని బొత్స ప్రశ్నించారు.
మంత్రి మనోహర్ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్సకు ఎందుకు మాట్లాడేందుకు అనుమతిచ్చారంటూ మంత్రి మనోహర్ ప్రశ్నించారు. మంత్రి మనోహర్ మీరు ఒక వైపే చూస్తున్నారు.. రెండో వైపు చూడండంటూ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

Comments
Please login to add a commentAdd a comment