మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి కన్నుమూత | Former MLA Ravi Sobhadrani passed away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి కన్నుమూత

Published Sat, Apr 14 2018 3:22 AM | Last Updated on Tue, Jul 31 2018 5:33 PM

Former MLA Ravi Sobhadrani passed away - Sakshi

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి (95) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1924 మార్చి 24న జన్మించిన రావి శోభనాద్రి తొలుత వామపక్ష పార్టీల సానుభూతి పరుడుగా దివంగత పుట్టగుంట సుబ్బారావు అనుచరునిగా ఉండేవారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో టీడీపీలో చేరారు. 1983లో గుడివాడ నుంచి ఎన్టీఆర్‌ పోటీ చేయగా ఆయన విజయానికి రావి కృషి చేశారు. 1985లో ఎన్టీర్‌ గుడివాడ ఎమ్మెల్యేగా రాజీనామా చేయటంతో గుడివాడలో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా రావి శోభనాద్రి చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. 1985 నుంచి 89 వరకు, 1994 నుంచి 99 వరకు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు.1999లో శోభనాద్రి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement