సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే
అలంపూర్ : అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమన్వయంగా ఉద్యమించి గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను సాధించుకుందామని మాజీ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే అబ్రహాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
– మాజీ ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ : అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమన్వయంగా ఉద్యమించి గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను సాధించుకుందామని మాజీ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే అబ్రహాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరి ఆకాంక్ష గద్వాల జిల్లా..అన్ని వర్గాల వారు, రాజకీయ, ప్రజా సంఘాలు జిల్లా కోసం ఉద్యమిస్తున్నారన్నారు. సమన్వయంతో ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా ఉద్యమిస్తే జిల్లా తప్పక సాధించుకోవచ్చన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తామన్నారు. కానీ ప్రజల అవసరాలు, భౌగోళిక అంశాలు, జనాభా, పాలన సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు చేయాలన్నారు. కార్యాలయాలకు అనువైన స్థలాలు, నీటి లభ్యత, విద్యుత్, రవాణ వ్యవస్త, రైలు మార్గాలు, చారిత్రక అంశాలు, అక్షరాస్యత, భౌగోళికం, ఆదాయ వ్యయాల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు కిషోర్, కలుగోట్ల కంగాలు, శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, ప్రసాద్ తదితరులు ఉన్నారు.