Jogulamba dist
-
సమన్వయంతో జిల్లా సాధించుకుందాం
– మాజీ ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్ : అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమన్వయంగా ఉద్యమించి గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను సాధించుకుందామని మాజీ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే అబ్రహాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరి ఆకాంక్ష గద్వాల జిల్లా..అన్ని వర్గాల వారు, రాజకీయ, ప్రజా సంఘాలు జిల్లా కోసం ఉద్యమిస్తున్నారన్నారు. సమన్వయంతో ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా ఉద్యమిస్తే జిల్లా తప్పక సాధించుకోవచ్చన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తామన్నారు. కానీ ప్రజల అవసరాలు, భౌగోళిక అంశాలు, జనాభా, పాలన సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు చేయాలన్నారు. కార్యాలయాలకు అనువైన స్థలాలు, నీటి లభ్యత, విద్యుత్, రవాణ వ్యవస్త, రైలు మార్గాలు, చారిత్రక అంశాలు, అక్షరాస్యత, భౌగోళికం, ఆదాయ వ్యయాల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు కిషోర్, కలుగోట్ల కంగాలు, శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
గద్వాల జిల్లా చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష
గద్వాల : ‘జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గద్వాలకు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లో ఈ పేరు లేకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాం..’ అని ఎమ్మెల్యే డీకేఅరుణ హెచ్చరించారు. శుక్రవారం గద్వాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జోగుళాంబ జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. అర్హతలను బట్టి కాకుండా రాజకీయంగా జిల్లాలను ఏర్పాటుచేస్తే ప్రజావ్యతిరేకత తప్పదన్నారు. జిల్లాల ఏర్పాటులో సీఎం కేసీఆర్‌ను కొందరు నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వీటిని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంద్ విజయవంతం గద్వాల జిల్లా సాధన కోసం అఖిలపక్ష నాయకులు చేపట్టిన గద్వాల బంద్ విజయవంతమైంది. శుక్రవారం పట్టణంలో దుకాణాలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. పుష్కర భక్తులను దష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చారు. ముందుగా ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. బస్సుల రాకపోకలపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని డ్యాం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.