స్వాతంత్య్ర సమరయోధులు, హిందూపురం మాజీ ఎమ్మెల్యే దొండప్ప గారి కదిరప్పకు ఘనంగా నివాళులర్పించారు.
హిందూపురం టౌన్ : స్వాతంత్య్ర సమరయోధులు, హిందూపురం మాజీ ఎమ్మెల్యే దొండప్ప గారి కదిరప్పకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం దొండప్ప గారి కదిరప్ప వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్జీఓ హోమ్‌లో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. 1940–1950 మధ్య కాలంలో హిందూపురం ఎమ్మెల్యేగా కదిరప్ప సేవలు అందించారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ్‌కుమార్, బీఎస్పీ నాయకులు శ్రీరాములు, నారాయణస్వామి, శివకుమార్, గంగాధర్, హనుమంతు, వెంకటరాములు, ఏపీఎస్‌ఆర్టీసీ నాయకులు సుందర్‌రాజు, గంగాధరప్ప, నరసింహులు, నాగార్జున, రాజు, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.