
ఫరీదాబాద్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారానికి సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసంపై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసం సహా ఆయన సోదరుల నివాసాలతో పాటు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరీ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ హయాంలో రాబర్ట్ వాద్రాకు కారు చౌకగా భూములు కట్టబెట్టారనే వ్యవహారంలో భాగంగా ఈ దాడులు సాగాయి. ఫతేపూర్ మాజీ సర్పంచ్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. కాగా తనను వేధించేందుకే తన నివాసంపై ఐటీ అధికారుల దాడులు జరిగాయని నాగర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment