రాజోలు మాజీ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan Mohan Reddy Visitation to Former MLA Alluri Krishnam Raju | Sakshi
Sakshi News home page

రాజోలు మాజీ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ పరామర్శ

Published Thu, Jul 28 2016 11:28 PM | Last Updated on Wed, Oct 3 2018 7:34 PM

రాజోలు మాజీ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

రాజోలు మాజీ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ పరామర్శ

హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు.

ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు కృష్ణంరాజుతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ సమయంలో కృష్ణంరాజు భార్య మల్లేశ్వరి, చిన్నకుమార్తె కృష్ణకుమారి, కుమారుడు శ్రీనివాసరాజు అక్కడే ఉన్నారు. కృష్ణంరాజుకు నిమ్స్ కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, చెస్ట్ డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ జీఎస్‌ఎన్ రాజులు వైద్యమందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement