ఇంకా దొరకని మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం ఆచూకీ
తిరుమల: ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల వచ్చిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తప్పిపోయారు. శనివారం సాయంత్రం కుటుంబంతో కలిసి మూలవిరాట్టును దర్శించుకున్న ఆయన.. ఆలయం నుంచి వెలుపలికి వస్తూ తప్పిపోయారు. దీంతో భిక్షం కుటుంబీకులు తిరుమల పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బుర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన భిక్షం కొంతకాలంగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యను ప్రారంభించారు. అయితే 24 గంటలు గడుస్తున్నా మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు కుంజా భిక్షం క్షేమంగా తిరిగి రావాలని ఆయన కుటుంబసభ్యులు ప్రార్థిస్తున్నారు.