కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ను పక్క రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రధానంగా యూపీలో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీలోకి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జాయిన్ అయ్యారు. యూపీకి చెందిన సోమవారం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలోకి చేరారు. వీరిలో రాజేష్‌పతి త్రిపాఠి, లలితేష్‌పతి త్రిపాఠిలు ఉన్నారు.
యూపీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీగా రాజేష్‌పతి త్రిపాఠి పనిచేయగా, లలితేష్‌పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడిగాను, మాజీ శాసన సభ్యుడిగాను పనిచేశారు.ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. టీఎంసీ విధానాల పట్ల ఆకర్శించబడి.. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరటానికి మక్కువ చూపిస్తున్నారని అన్నారు. ఇక టీఎంసీ తీర్థం పుచ్చుకున్న వారిద్దరూ మాట్లాడుతూ.. బీజేపీని అధికారంలోంచి దింపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే టీఎంసీలో చేరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment