
మహారాజులు, మహారాణులు, గుర్రం సవారీలు, రణరంగాలు, లవ్ స్టోరీలు, కత్తులు, కటార్లు... వీటన్నిట్లో ఒక రిస్క్ ఉంటుంది. తలలు తెగిపడుతూ ఉంటాయి. ఒకడేమో ‘తల తెగినా పర్వాలేదు, తల దించను’ అంటాడు. ‘రేయ్ దించరా.. లేకపోతే తెగ్గొడతాను’ అని ఇంకోడు అంటాడు. సినిమా హాల్లో, డీటీఎస్‌లో ఇలాంటి డైలాగ్స్ వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. కుర్చీలోంచి లేచి ఈల వేయబుద్దేస్తుంది. కానీ ఇలాంటి డైలాగ్‌లు రోడ్ల మీద కొడితే ఏసేది ఈలలు కాదు, సంకెళ్లే!
సూరజ్‌పాల్ అనే ఓ బీజేపీ సారు టంగు స్లిప్ అయ్యాడు. డెమోక్రసీలో ఇలాంటి స్లిప్పులకి ‘స్లాప్’లు తప్పవు. ‘పద్మావతి’ సినిమా చేసి, రాజపుత్ గౌరవానికి తలవంపులు తెచ్చారని, అలా తలవంపులు తెచ్చిన వాళ్ల తలలు.. అంటే డ్రామా హెడ్ అయిన డైరెక్టరు భన్సాలీ, పద్మావతి పాత్ర వేసిన అందాల హెడ్డు అయిన దీపికా పడుకోన్‌ల తలలు తెగ్గొట్టుకొని తెస్తే టెన్ క్రోర్స్.. తెలుగులో చెప్పాలంటే అక్షరాలా పది కోట్ల రూపాయలు లెండి.. నజరానా ఇస్తానన్నాడు. ఆ మాటకే నజర్ తగిలింది. బిడ్డ బుక్ అయ్యాడు. ముందే చెప్పాం కదా.. తెగేదాకా లాగొద్దు బిడ్డా అని.
Comments
Please login to add a commentAdd a comment