‘పద్మావతి’ వివాదం: సీఎం కేసీఆర్‌కు రాజాసింగ్‌ లేఖ | raja singh letter to cm kcr on padmavati | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 6:59 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

raja singh letter to cm kcr on padmavati - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొందరి మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మంగళవారం లేఖను రాశారు. రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి మనోభావాలు తీవ్రంగా గాయపడుతున్నాయన్నారు. ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలని రాజాసింగ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ వర్గీయుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉందంటూ ఇప్పటికే ఈ సినిమాను పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు నిషేధించగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారు కూడా ఇదే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement