రోడ్డు ప్రమాదంలో పద్మావతి అనే మహిళ దుర్మరణం చెందింది.
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. కర్నూలు జిల్లా నంద్యాల టౌన్‌లో శనివారం బైక్‌పై వెళుతున్న మహిళలను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పట్టణానికి చెందిన పద్మావతిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.