![ఇదిగో పద్మావతి!](/styles/webp/s3/article_images/2017/09/4/61479490537_625x300.jpg.webp?itok=7GAkiuTb)
ఇదిగో పద్మావతి!
సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’లో దీపికా పదుకొనే లుక్ ఎలా ఉంటుందంటే.. పక్కనున్న స్కెచ్‌లో మీరు చూస్తున్నట్టు ఉంటుంది. ఇందులో ముక్కుపుడక, నగలు చూస్తుంటే ‘బాజీరావ్ మస్తానీ’లో దీపిక లుక్ గుర్తొస్తుందా! అందులోనూ రాణి పాత్రే కదా. ఈ రెండు సినిమాలకూ దర్శకుడు ఒక్కరే. మస్తానీ ముస్లిమ్ అయితే.. పద్మావతి హిందూ. లుక్, క్యారెక్టర్ పరంగా చాలా మార్పు ఉంటుందట. ఈ సినిమాలో పద్మావతి భర్త రాజా రావల్‌సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.