నా భర్తగా ఆయన వొద్దు! | Padmavati, Deepika Padukone refuses to have Vicky Kaushal as her husband in film | Sakshi
Sakshi News home page

నా భర్తగా ఆయన వొద్దు!

Published Tue, Jul 19 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

నా భర్తగా ఆయన వొద్దు!

నా భర్తగా ఆయన వొద్దు!

భారీ కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తాజా చిత్రం 'పద్మావతి' షూటింగ్ ఈ సెప్టెంబర్‌లో పట్టాలెక్కబోతున్నది. ఈ సినిమాలో నిజజీవిత ప్రేమపక్షులైన దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ మరోసారి కలిసి నటించనున్నారు. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా చారిత్రక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పద్మావతి భర్త రాజా రావల్ రతన్‌సింగ్‌ పాత్ర చాలా కీలకమైనది.

పద్మావతిగా దీపిక నటిస్తుండగా ఆమె భర్తగా యువ నటుడు విక్కీ కౌశల్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించినట్టు కథనాలు వచ్చాయి. 'మసాన్', 'రమణ్‌రాఘవ్' సినిమాలతో నటుడిగా నిరూపించుకున్న ఆయన ఈ పాత్ర కోసం ఆడిషన్‌లో కూడా పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, విక్కీని తీసుకునేందుకు చిత్రయూనిట్ నిర్ణయించినా.. చివరినిమిషంలో దీపిక మోకాలడ్డినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పద్మావతి, ఆమె భర్త మధ్య కొన్ని ఘాటైన రొమాంటిక్ సీన్లు ఉంటాయని, కాబట్టి పెద్ద హీరోను తన భర్త పాత్రకు తీసుకుంటే బాగుంటుందని దీపిక పేర్కొన్నట్టు వినిపిస్తోంది. సినిమాలో కీలకమైన ఈ పాత్రకు అంతగా గుర్తింపులేని నటుడిని తీసుకుంటే ఫలితం ఉండదని, కాబట్టి మంచి పేరున్న హీరోని ఈ పాత్ర కోసం తీసుకోవాలని ఆమె దర్శకుడికి చెప్పినట్టు ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ తెలిపింది.      
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement