
ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదలైన 'పద్మావతి' మొదటి ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్‌లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ఎపిక్ హిస్టోరికల్ డ్రామాలో దీపిక, రణ్‌వీర్ సింగ్‌లతోపాటు షాహిద్ కపూర్ కూడా కీలక పాత్ర పోషించారు. సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీపై పోరాటం జరిపే రాజ్‌పుత్ పాలకుడు రావల్ రతన్ సింగ్‌గా షాహిద్ నటించాడు. అతని భార్య రాణి పద్మావతిగా దీపిక టైటిల్ రోల్ పోషించగా.. విలన్ ఖిల్జీగా రణ్‌వీర్ దర్శనమిచ్చాడు.
ట్రైలర్ విడుదలైన నాటినుంచి ఈ సినిమాలో ఖిల్జీగా భయానక రౌద్రరూపులో కనిపించిన రణ్‌వీర్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరోచిత అభినయం కనబర్చిన దీపికనూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో షాహిద్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు ఆసక్తి రేపుతోంది. తన పాత్ర రతన్ సింగ్ పోస్టర్‌ను పోస్టు చేసి.. 'నీరు చాలా లోతుగా ప్రవహిస్తుంది. అతని రాక కొరకు డిసెంబర్ 1వ వరకు ఆగండి' అంటూ చాలా సంక్షిప్తంగా షాహిద్ కపూర్ తన అభిమానులను ఉద్దేశించి పోస్టు చేశారు. ఈ మిస్టరీ పోస్టు వెనుక కారణాలు ఏమిటన్నది తెలియకపోయినా.. 'పద్మావతి'లో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం, తన కనబర్చిన నటన గురించి నిగూఢంగా షాహిద్ సందేశమిచ్చినట్టు భావిస్తున్నారు. షాహిద్ పాత్ర కూడా ఈ సినిమాలో వీరోచితంగా చాలా కీలకంగా ఉండబోతున్నదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment