పద్మావతిలో రణవీర్ లుక్ | Ranveer singh look in Padmavati | Sakshi
Sakshi News home page

పద్మావతిలో రణవీర్ లుక్

Published Sun, Nov 13 2016 12:03 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

పద్మావతిలో రణవీర్ లుక్

పద్మావతిలో రణవీర్ లుక్

రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలతో అదరగొట్టిన సంజయ్ లీలా బన్సాలీ, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. చారిత్రక కథతో తెరకెక్కుతున్న పద్మావతి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా ఎలాంటి ఫోటోలు బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు రణవీర్ సింగ్. ఈ సినిమాలో విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటిస్తున్న రణవీర్, కేవలం తన కళ్లు మాత్రమే కనిపించేలా ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. కోపంగా చూస్తున్న రణవీర్ కళ్లు సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో తెలిపేలా ఉంది. ఈ ఫోటోతో పాటు 17.11.17 అనే రోమన్ నెంబర్స్తను పోస్ట్ చేసిన రణవీర్ సినిమా రిలీజ్ డేట్పై కూడా హిట్ ఇచ్చేశాడు.

సంజయ్ లీలా బన్సాలీ మరో విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్న  పద్మావతి సినిమాలో దీపికా పదుకొనే, పద్మావతిగా టైటిల్ రోల్లో కనిపిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్, పద్మావతి భర్త రాజా రావల్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement