
'ఆ అనుభవం కోసం సిద్దంగా ఉన్నాను'
ముంబయి: తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లయినా.. తనకు ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తుందని ప్రముఖ బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే చెప్పింది. 'పద్మావతి'లాంటి సాహసోపేతమైన చిత్రాల్లో నటించేందుకు తాను ఎప్పటికీ సిద్ధమేనని చెప్పారు.
'తొమ్మిదేళ్లు పూర్తయినట్లుగా నాకు ఇప్పటికీ అనిపించడం లేదు. ఇప్పుడే కెరీర్ ప్రారంభించినట్లుంది. నేను ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది. మరిన్ని చిత్రాల్లో మరింత సాహసోపేతమైన పాత్రలు చేసేందుకు నేను సిద్దం. పద్మావతి చాలా కష్టమైన పాత్ర. కానీ నేను ఆ పాత్ర చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. ఆ చిత్ర ప్రయాణం మొదలుపెట్టేందుకు ఆ అనుభవం ఆస్వాధించేందుకు సిద్దంగా ఉన్నాను' అని దీపికా చెప్పింది.