
ముంబయి : షూటింగ్ సమయంలో పలు అడ్డంకులు ఎదుర్కొని తీరా చిత్రీకరణ పూర్తయ్యాక విడుదలకు ముందు వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ చిత్రం పద్మావతికి మావోయిస్టుల మద్దతు లభించింది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోవద్దని తెలిపారు. ఈ మేరకు చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ, బస్తర్ జిల్లాలో పోస్టర్లు అంటించారు. కరపత్రాలు ముద్రించారు. ప్రభుత్వం వెంటనే ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకొని విడుదల చేయాలని, స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని అందులో డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతాల్లోని పోలీసులు కూడా ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment