వైద్యాధికారిణి పద్మావతిపై దాడి | medical officer padmavati was attacked | Sakshi
Sakshi News home page

వైద్యాధికారిణి పద్మావతిపై దాడి

Aug 14 2013 9:36 PM | Updated on Sep 1 2017 9:50 PM

మంత్రి తోట నరసింహ అనుచరులు వీరంగ సృష్టించారు

తూ.గో: మంత్రి తోట నరసింహ అనుచరులు వీరంగ సృష్టించారు. జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారిణిపై మంత్రి అనుచరులు బుధవారం దాడికి దిగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న మంత్రి సతీమణి వాణికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పద్మావతిపై పేడ, వాటర్‌ ప్యాకెట్‌లతో  దాడి చేయడంతో షాక్ గురైన ఆమె పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తుంటే ఇప్పుడా వచ్చేది అని నిలదీసిన మంత్రి అనుచరులు ఆమెను నిర్భందించేందుకు యత్నించారు. దీంతో చేసేది లేక వైద్యాధికారిణి వెళ్లిపోయారు.
 
 అంతకుముందుమంత్రి సతీమణి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. సమైక్యవాదులు పోలీసులను అడ్డుకోవడంతో ఆమె దీక్ష యథావిధిగా కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement