Thota Narasimham
-
జగ్గంపేట నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్సీపీదే గెలుపు: నరసింహం
-
రానున్న మూడు నెలలకాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా: తోట నరసింహం
-
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
‘సీఎం వైఎస్ జగన్ పనితీరు అద్భుతం’
సాక్షి, కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ తోట నరసింహం కొనియాడారు. బుధవారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పనితీరును ప్రశంసించారు. పరిణితి చెందిన రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ ఆయన కంటే అనేక మంచి కార్యక్రమాలను చేసి చూపిస్తున్నారని పొగిడారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఒక ఆదర్శ ముఖ్యమంత్రిలా కనిపించారని పేర్కొన్నారు. గతంలో తాను నలుగురు సీఎంల వద్ద పని చేశానని, వైఎస్ జగన్ లాంటి జనామోద నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రిని చూడలేదని ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోనే నవ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు పొందారని తోట నరసింహం అన్నారు. కాగా, ఎన్నికలకు ముందు తోట నరసింహం, వాణి దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాణి స్వల తేడాతో ఓటమి పాలయ్యారు. -
చంద్రబాబుకి అనుమానం కలగడం హాస్యాస్పదం..
కాకినాడ: ఈవీఎంలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుమానం కలగడం హాస్యాస్పదమని కాకినాడ ఎంపీ తోట నర్సింహం విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తోట నర్సింహం విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికలతో పాటుగా నంద్యాల ఉప ఎన్నికలు.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎంలపైనే జరిగాయని, ఆ ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది..అప్పుడు రాని అనుమానం ఇప్పుడు ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. చాలా అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి కుంటిసాకులతో ప్రజలను మభ్యపెట్టడం సరైనది కాదన్నారు. వైఎస్ జగన్‌ను ఒక్కసారి చూడాలన్న తలంపు ప్రజల్లో వచ్చిందని, అందుకే 80 శాతం పోలింగ్ జరిగిందని అభిప్రాయపడ్డారు. నిజంగా ఈవీఎంలపై అనుమానం వస్తే ప్రజలే గగ్గోలు చేసేవారని వ్యాక్యానించారు. చంద్రబాబు పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్సీపీ గెలిచినట్లుగానే భావిస్తున్నామని అన్నారు. -
చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండదని, ఏపీకి ప్రత్యేక హోదా అంశం సాధించే విషయంలో అనారోగ్యం పాలైతే పట్టించుకున్న నాథుడు లేడని కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యతను టీడీపీ మరిచిందని మండిపడ్డారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో తన భార్య తోట వాణితో కలిసి ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనారోగ్యం పాలైన జక్కంపూడి రామ్మోహన్‌రావుని ఆయన శ్రద్ధ చూపి ఆదుకున్నారని గుర్తు చేశారు. అది నాయకుడి మంచి లక్షణాలకు ఒక పెద్ద ఉదాహరణ. అది వైఎస్సార్ గొప్పతనం. ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇచ్చే విషయం కాదు. కానీ టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు. అందుకనే టీడీపీనీ వదిలేశాను. ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తాము. ఆయన నాయకత్వంలొనే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. టికెట్ కేటాయింపు అధినేత ఇష్టం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. చంద్రబాబుకు మేమిచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేదు. 5 శాతం కాపు రిసర్వేషన్ల అమలు దేవుడి చేతిలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇది శుభసూచకం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం శుభ సూచకమన్నారు తోట వాణి. ఆరోగ్యం లెక్క చేయకుండా నరసింహం టీడీపీ కోసం పని చేస్తే కనీసం ఎవరూ లెక్క చెయ్యలేదని మండిపడ్డారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదని వాపోయారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు కూడా చేయకపోవడం చాలా బాధ అనిపించిందన్నారు. కబ్జాలు, మైనింగ్క్వారీలను మింగేసిన వారికి టికెట్ ఇవ్వడమే టీడీపీ సర్వేనా అని సూటిగా ప్రశ్నించారు. తన భర్త ఆరోగ్యం విషయంలో వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు
-
వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ
-
కోస్తా జిల్లాల్లో టీడీపీకి భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి కోస్తా జిల్లాల్లో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, నటుడు రాజారవీంద్ర కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న నరసింహం ఇప్పటికే టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నరసింహం చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ బలం పుంజుకోనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ నటుడు రాజారవీంద్ర (‘తూర్పు’న టీడీపీకి షాక్) వైఎస్ జగన్ సమక్షంలో.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడ వెస్ట్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు పూర్ణచంద్రరావు, బొచ్చు రమేష్ , అప్పజి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ రామచంద్రయ్య యాదవ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కెనపల్లి లక్ష్మయ్య, టీడీపీ మైనార్టీ నేత సాధిక్ భాష, మాజీ ఎంపీటీసీ రమణ వైఎస్సార్సీపీలో చేరారు. -
‘తూర్పు’న టీడీపీకి షాక్
కాకినాడ/జగ్గంపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం కాకినాడలోని తన నివాసంలో అభిమానులు, సహచరుల అభీష్టం మేరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తోట సోదరుడు, మాజీ ఎమ్మెల్యే తోట వెంకటాచలం మరణంతో 2003లో తోట నరసింహం రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005 నుంచి 2010 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తోట 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా సేవలందించారు. 2014లో కాంగ్రెస్‌ను వదిలి టీడీపీ తరపున కాకినాడ ఎంపీగా గెలుపొందారు. టీడీపీ లోక్‌సభా పక్షనేతగా, వివిధ కేంద్ర అనుబంధ కమిటీలకు సభ్యునిగా సేవలందించారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ తోట నరసింహం బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన సతీమణి తోట వాణి, సన్నిహితులతో కలిసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తోట నరసింహం ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన అనుచరులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో వలస నేత జ్యోతుల నెహ్రూను ఓడించాలని ప్రజలకు తోట నరసింహం పిలుపునిచ్చారు. యనమల, చినరాజప్పపై ‘తోట’ ఆగ్రహం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై తోట వాణి నిప్పులు చెరిగారు. ఆమె మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన తమ కుటుంబాన్ని అణగదొక్కేందుకు చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించారు. మరణించిన తన తండ్రి, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను పలు ఇంటర్వ్యూల్లో అవమానకరంగా సంబోధించారని, మరెన్నో విధాలుగా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. మంత్రి యనమల తీరుపై కూడా ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని జిల్లాలో ఓ పెద్దాయనకు అది బలుపో, బద్ధకమో తెలియడం లేదంటూ చురకలంటించారు. తన భర్త అనారోగ్యంతో ఉంటే కనీసం పలకరించలేదని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఆ పార్టీ నేతల్లో కనీసం మానవత్వం కూడా లేకపోయిందని ధ్వజమెత్తారు. కష్టపడినా టీడీపీలో గుర్తింపు లేదు! తెలుగుదేశం పార్టీ, కాకినాడ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తోట నరసింహం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలోని తన నివాసంలో మంగళవారం రాత్రి కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ తరపున పోరాటం చేసి, అనారోగ్యం బారిన పడ్డానని, కష్టించి పనిచేసినా తనకు గుర్తుంపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా పోటీ చేయలేకపోతున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం మేరకు తమ కుటుంబం నడుచుకుంటుందని, తమకు అప్పగించిన బాధ్యతలు నెరుస్తామని వెల్లడించారు. ‘పర్వత’ కుటుంబం గుడ్‌బై.. మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.1999లో ఆమె టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి అదేపార్టీలో కొనసాగుతున్నారు. ఆమె భర్త పర్వత సుబ్బారావు 1994లో ఎమ్మెల్యేగా సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంతోపాటు మెట్ట ప్రాంత రాజకీయాల్లో ‘పర్వత ’ కుటుంబానికి గట్టి పట్టుంది. టీడీపీని వీడాలని పర్వత బాపనమ్మ మంగళవారం నిర్ణయించుకున్నారు. ఆమెతోపాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు, ఆయన భార్య జానకీదేవితోపాటు వారి అనుచరులు సైతం టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. -
చినరాజప్పపై తోట వాణి ఆగ్రహం
-
‘చనిపోయిన నా తండ్రినీ ఆయన వదల్లేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు. సంస్కారం లేని పెద్దాయన ‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ లో చేరనున్నా తోట దంపతులు
-
టీడీపీని వీడిన తోట నరసింహం..రేపు వైఎస్సార్ సీపీలోకి
సాక్షి, కాకినాడ/ తూర్పుగోదావరి : తూర్పుగోదావరిలో అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. వారిరువురు బుధవారం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ... టీడీపీలో తమకు దారుణమైన అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తన భర్తకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరినా చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. వైఎస్సార్ సీపీలో తమకు సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు. మానవత్వం కూడా లేదా? ‘ఈ మధ్య చంద్రబాబు నుంచి కబురు వచ్చింది. నా భర్త అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాం. ఈ విషయాన్ని మా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు చెప్పాను. అప్పటి నుంచి జిల్లా టీడీపీ నేతలు కనీసం నా భర్తను పలకరించలేదు. వాళ్ళను చూస్తే కనీసం మానవత్వం లేదా అనిపించింది. తోట నరసింహం చిన్న వ్యక్తి కాదు. గత పదిహేనేళ్లుగా రాజకీయాలలోను...ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు’ అని ఆవేదన వాణి వ్యక్తం చేశారు. కాగా జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించారు. ఈ టికెట్‌ను వైఎఎస్సార్ సీపీ గుర్తుపై గతంలో గెలిచిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. రేపే వైఎస్సార్ సీపీలోకి సాక్షి, జగ్గంపేట/ తూర్పుగోదావరి : కిర్లంపూడి మండలం వీరవరంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఎంపీగా తాను సమర్ధవంతంగా పనిచేశానని పేర్కొన్నారు. ‘ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేసిన ఆందోళనల ఫలితంగానే అనారోగ్యం పాలయ్యాను. కార్యకర్తల అభిప్రాయం మేరకు ప్రస్తుతం పార్టీని వీడుతున్నాను. వేరే పార్టీ టికెట్‌పై నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే నా కార్యకర్తలను అణగదొక్కారు. రేపు నా కుటుంబంతో సహా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. నా అనారోగ్యం కారణంగా నా భార్య వాణిని పెద్దాపురం నుంచి పోటీ చేయించనున్నాను’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో తోట నరసింహం కుటుంబాన్ని కలిసిన వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు తోట నరసింహం కుటుంబాన్ని కలిశారు. -
బాబుతో తోట నరసింహం భార్య భేటీ
అమరావతి: టీడీపీ కాకినాడ ఎంపీ తోట నరసింహం పార్టీ మారనున్నారని పుకార్లు గుప్పుమనడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో తోట నరసింహం భార్య తోట వాణి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను వైఎఎస్సార్సీపీ గుర్తుపై గతంలో గెలిచిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించారు. అదే విషయమై తోట వాణి, చంద్రబాబును కలిశారు. తోట కుటుంబానికి చంద్రబాబు ఏం హామీ ఇచ్చారనేది మిస్టరీగా మారింది. అలాగే అరకు పార్లమెంటు పరిధిలోని నేతలతో కూడా చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్ కుమారుడు ఆర్పీ భాంజ్ దేవ్‌కు సాలూరు టికెట్ దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అదే టికెట్ ఆశించిన సంధ్యారాణికి ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సంధ్యారాణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. -
తాడోపేడో..
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): కాకినాడ ఎంపీ తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకోవడానికి ఎంపీ తోట వర్గం సిద్ధమవుతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం కలిసి జగ్గంపేట అసెంబ్లీ సీటు సాధించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీ తోట వర్గం గట్టిగా పట్టుబడుతోంది. దీంతో ఆరు నూరైనా నూరు ఆరైనా అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంపీ తోట ఒక నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు శనివారం రాత్రి నియోజకవర్గం నలుమూలల నుంచీ వచ్చిన తన అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గోకవరం మండలాలకు చెందిన ఆయన వర్గీయులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆదివారం కూడా అధిక సంఖ్యలో తోట వర్గీయులు వీరవరం చేరుకుని తమ మనోగతం చెప్పారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో జగ్గంపేట నియోజకవర్గంలోని అసలైన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చినవారు ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని, నిజమైన కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివ్వడం లేదని, పైగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఎంపీ తోట వద్ద వాపోయారు. ఇప్పటికైనా మేల్కోకపోతే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తోటపై వారు ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఎంపీ తోట స్పందిస్తూ ప్రాణం ఉన్నంత వరకూ జగ్గంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, తన ఆరోగ్యం సహకరించకపోతే తన భార్య వాణి పోటీ చేస్తుందని కార్యకర్తలకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు అపార నమ్మ కం ఉందని, జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు తమ కుటుంబానికే కేటాయిస్తారని ఆశిస్తున్నానని, ఈమేరకు అసలైన కార్యకర్తలందరూ విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించా రు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు. -
టీడీపీ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం
నక్కపల్లి (విశాఖపట్నం) : కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఆదివారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్గేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎంపీ కాకినాడ నుంచి విశాఖ వెళుతుండగా వాహనం చినదొడ్డిగల్లు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పైకి ఎక్కింది. ముందు చక్రం విరిగిన వాహనం డివైడర్ మధ్యలో నిలిచిపోయింది. అరుుతే తోట ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తె లిసిన చినదొడ్డిగల్లు ఎంపీటీసీ సభ్యుడు వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ డెరైక్టర్ వెలగా సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎంపీని పరామర్శించారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నట్టు తెలిసింది. తోట స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భగవంతుని దయవల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానన్నారు. హైవే పోలీస్ సిబ్బంది క్రేన్‌ను రప్పించి వాహనాన్ని పక్కకు తొలగించారు. తర్వాత ఎంపీ మరో వాహనంలో విశాఖ వెళ్లారు. -
రుణం తీర్చుకోలేనంటే ఇదేనా!
కీలకమైన పదవుల పందేరం సమయంలో చంద్రబాబుకు మేం కనిపించమా? అని టీడీపీలోని కాపు సామాజికవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపుల వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలకు చేరింది. ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ ఈ జిల్లా రుణం తీర్చుకోలేనని పదే పదే చెప్పిన చంద్రబాబు.. తీరా రుణం తీర్చుకునే అవకాశం వచ్చేసరికి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. * కేంద్రమంత్రి పదవికి పనికిరామా? * చంద్రబాబుపై కాపుల గుర్రు * గోదావరి నేతలకు మొండిచేయి * ‘తోట’ పేర్లను కనీసం పరిశీలనలోకి కూడాతీసుకోకపోవడంపై ఆవేదన సాక్షి ప్రతినిధి, ఏలూరు : కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మంత్రివర్గ విస్తరణలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు చోటు దక్కకపోవడంపై ఆయా వర్గాల నుంచి అసంతృప్తరాగం వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాల ఫలితాలే కీలకమయ్యాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతెందుకు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంలోనూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ పదే పదే ప్రకటనలు చేశారు. కానీ పదవుల పందేరానికి వచ్చేటప్పటికి మొండిచేయి చూపిస్తున్నారంటూ టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రమంత్రివర్గ విస్తరణలో గోదావరి జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం, కాపు సామాజికవర్గానికి చెందిన వారిని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోకపోవడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పదేళ్ల యూపీఏ సర్కారులో గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ కాంగ్రెస్ నేతలను కేంద్రంలో కీలక పదవులు వరించాయి. పశ్చిమగోదావరికి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు కార్మిక, బొగ్గుగనుల శాఖ దక్కగా, సినీనటుడు చిరంజీవికి స్వతంత్రహోదాలో పర్యాటకశాఖ దక్కింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.ఎం. పళ్లంరాజుకు ఏకంగా రక్షణశాఖనే కట్టబెట్టారు. మొత్తంగా గత పదేళ్లలో గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఐదునెలల కిందట ఎన్డీఏ సర్కారు కొలువుదీరిన తర్వాత కేంద్రంలో మిత్రపక్షమైన టీడీపీ తరఫున ఒకే ఒక కేంద్ర మంత్రి పదవి విజయనగరం ఎంపీ అశోక గజపతిరాజుకు దక్కింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గవిస్తరణలోనైనా గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలకు, ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల తరఫున ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవులు దక్కుతాయని అందరూ ఆశించారు. ఆశలపై నీళ్లు బీజేపీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందినవారు ఎంపీలుగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలోని కాపు ఎంపీలకు కేంద్రమంత్రి వర్గ విస్తరణలో స్థానం లభిస్తుందని ఆశించారు. కాపులకు సముచిత స్థానం కల్పిస్తామంటూ ఇటీవలికాలంలో బాబు చేస్తున్న ప్రకటనలతో వారు పదవులపై ఆశలు పెంచుకున్నారు. అయితే విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనాచౌదరికి కట్టబెట్టి గోదావరి జిల్లాలకు చెందిన కాపునేతలను విస్మరించారన్న వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల నుంచి తెలుగుదేశం తరఫున ఇద్దరు కాపు సామాజిక వర్గనేతలు ఎంపీలుగా ఉన్నా పదవుల పందేరంలో చంద్రబాబు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదన్న వాదనలు స్వయంగా ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట నరసింహం కాకినాడ ఎంపీగా గెలుపొందారు. ఆయన గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు చివరి నిమిషంలో టీడీపీలో చేరిన నేపథ్యం కాబట్టి ఈయన్ను పక్కన పెట్టారనుకున్నా రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కేంద్రమంత్రి పదవికి అన్ని విధాలా అర్హురాలని పార్టీవర్గాలు వాదిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎవ రూ పోటీ చేయడానికి ముందుకు రాని సమయంలో నరసాపురం ఎంపీగా ఆమె బరిలోకి దిగి ఓటమి చెందారు. పార్టీకి కష్టకాలంలో జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి ఎన్నికల సమయంలో పార్టీ విజయంలో ప్రధానభూమిక పోషించారు. దీంతో సహజంగానే కాపులు ఈసారి ఆమెకు కేంద్రమంత్రి వర్గంలో కనీసం సహాయమంత్రి పదవైనా వస్తుందని ఆశించారు. అయితే ఆమె పేరు ఎక్కడా ప్రస్తావనలోకి కూడా రాకపోవడంతో పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు, కార్యకర్తలు నిర్వేదానికి లోనవుతున్నారు. కానీ బయుటపడితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గంలో రాజుకుంటున్న అసంతృప్తిని చంద్రబాబు ఏవిధంగా చల్లారుస్తారో చూడాల్సిందే! -
చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
తాను అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను ఒంటి చేత్తో కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు సొంత పార్టీ నాయకులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకముందే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. ఎంపీగా నెగ్గిన టీడీపీ నాయకుడే స్వయంగా దాడులకు దిగినా పచ్చ పార్టీ అధినేత మిన్నకుండిపోయారు. కనీసం దాడులను ఖండించిన పాపాన పోలేదు. సొంతూరులో తనకు ఆధిక్యం దక్కలేదన్న అక్కసుతో కాకినాడ ఎంపీగా ఎన్నికైన టీడీపీ నేత తోట నరసింహం తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై గూండాల్లా దాడులకు తెగపడ్డారు. ‘వైఎస్సార్సీపీకి పనిచేస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ పెద్దాపురం మండలం దివిలి ఎస్సీ పేటలో ఇళ్లల్లోకి చొరబడి తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గాజులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు లాక్కొచ్చి మరీ చితక బాదారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని పొట్టపై విచక్షణారహితంగా తన్నడంతో ఆమె ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా భావపురిలో టీడీపీ కార్యకర్తలు కత్తులు చేతబట్టి కారులో స్వైరవిహారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తమ్ముళ్ల ఘాతుకాలకు అంతే లేదు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నుంచి కనీస స్పందన కరువయింది. సొంత పార్టీవారే దాడులకు తెగబడుతున్నా టీడీపీ అధినేతలో చలనం శూన్యం. శాంతి భద్రతలను కాపాడడమంటే ఇదేనా అని నిలదీస్తున్న బాధితులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? -
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
-
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
వీరవరం: తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తోట నర్సింహం తీరుతో వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో వీరవరంలో భారీగా పోలీసులను మొహరించారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాకినాడ ఎంపీ ఎన్నికల్లో తోట నర్సింహం గెలిచారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రాదేశిక ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరవరంలో ఆయనకు 875 ఓట్లు పడగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌కు 2,075 ఓట్లు పడ్డాయి. స్వగ్రామంలోనే ప్రత్యర్థికి ఆధిక్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరసింహం వీధి రౌడీలా మారిపోయారు. ఎంపీనన్న సంగతి మరిచి గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. -
ఆ ‘తోట’కు ఈ ‘తోట’కు మధ్య...
*బాబాయ్‌కి ఝలక్ *తోట నరసింహంపై పోటీకి తోట రవి సిద్ధం *జిల్లా కాంగ్రెస్ నేతల మంతనాలు జగ్గంపేట : రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనేది నానుడి. తమ స్వార్థ ప్రయోజనాలు కోసం రాజకీయ భవితవ్యాన్ని, పేరు ప్రతిష్టలు ఇచ్చిన పార్టీలను మార్చేసే నేతలకు బదులిచ్చేందుకు వారి కుటుంబ సభ్యులే సై అంటున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే తోట వెంకటాచలం రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసి రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీలో అందిపుచ్చుకున్న తోట నరసింహం ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్టీ కండువా మార్చేశారు. అభిమానులు ఒత్తిడి అనే పదాన్ని ప్రయోగించి తన రాజకీయ భవిష్యత్ కోసం మార్గాన్ని సుగమం చేసుకునేందుకు టీడీపీ పంచన చేరారు. రెండు కళ్ల సిద్ధాం తం అంటూ చంద్రబాబును నాడు విమర్శించి నేడు ఆయన ద్వారానే అభివృద్ధి జరుగుతుందని వేదాలు వల్లిస్తున్న నరసింహానికి ఇంటి పోరు మొదలైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను ఆచరణలోకి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు నరసింహం కుటుంబం నుంచే ఆ పార్టీకి నాయకుడిని బరిలో దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగ్గంపేట నుంచి అసెంబ్లీ స్థానానికి ఆయనకు వరసకు కుమారుడయ్యే తోట సూర్యనారాయణ మూర్తి (రవి)ని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా నరసింహం విజయం సాధించేందుకు రవి ఎంతగానో కృషి చేశారు. జగ్గంపేట ఇన్చార్జి బాధ్యతలను చేపట్టి పూర్తి మైనస్‌లో ఉన్న పార్టీకి జవసత్వాలు అందించిన రవిని ఎన్నికల అనంతరం తనకు పోటీగా తయారవుతాడని భావించి కావాలని దూరంగా పెట్టారు. నమ్ముకున్న వాడినే దూరంగా పెట్టడంతో తోట బంధువులు రకరకాలుగా చర్చించుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీగా గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం తన స్వార్థం కోసం ఎన్నికల్లో ఉపయోగించుకుని తరువాత పక్కన పెట్టడం, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రవిని బాబాయ్‌కి పోటీగా కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గంపేట స్థానానికి బరిలో దిగేందుకు రవి సిద్ధమవుతున్నారు. ఇది నరసింహానికి ఏం చిచ్చు పెడుతుందోనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
‘బాబుగారి’ మాటలకు అర్థాలే వేరులే..!
కాకినాడ: చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహార శైలి చెప్పకనే చెబుతోంది. ప్రజల సమక్షంలో, వారి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తానని పాలమూరు ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రకటించారు. కానీ, దీనికి భిన్నంగా వలస వచ్చిన నేతలు తమకు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ గొప్పలకు పోయిన మాజీమంత్రి తోట నరసింహం.. మాట మార్చి తన మామ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు దౌత్యం తో ఇటీవల చంద్రబాబు పంచన చేరారు. టీడీపీలో చేరిన అనంతరం మంగళవారం తొలిసారిగా జగ్గంపేట చేరిన ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు తాను, జగ్గంపేట నుంచి అసెంబ్లీకి జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తారని ప్రకటించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణరావు సమక్షంలోనే ఆయన చేసిన ఈ ప్రకటన తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపింది. కాంగ్రెస్ నుంచి వచ్చీరాగానే తనకు తానుగా అభ్యర్థినని ప్రకటించుకునే అధికారం తోటకు చంద్రబాబు ఇచ్చారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని జగ్గంపేట, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పార్టీ జెండాను భుజాన మోస్తోన్న పాతకాపులను పక్కన పెట్టి అడ్రస్ లేక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కట్టబెడుతున్న బాబు తీరును పార్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు జెల్లకొట్టి.. అక్కడి నుంచి బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ తోట నరసింహానికి టికెట్టు ఖాయం చేద్దామని చంద్రబాబు అనుకున్నారు. దీనిని పసిగట్టిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్‌లో నరసింహం ఇటీవల సైకిల్ ఎక్కిన సమయానికి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై భగ్గుమన్నారు. గత రెండుసార్లు అంతంతమాత్రం మెజార్టీతో గెలుపొంది ప్రజల ఆశలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేక వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి వ్యక్తికి చంటిబాబును పక్కన పెట్టి జగ్గంపేట టికెట్టు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారో 24 గంటల్లోగా చెప్పాలని పార్టీ నాయకులు అల్టిమేటమ్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు తగలేసుకుని తిరుగుతున్న చంటిబాబుకంటే నరసింహం ఎందులో ఎక్కువనేది చెప్పాలంటూ బాబు తీరును తూర్పారబట్టారు. దీంతో దిగొచ్చిన చంద్రబాబు జగ్గంపేట టికెట్టును చంటిబాబుకు ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం. మరోపక్క ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ టికెట్టుపై ఆశతో ఏడాది కాలంగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటకు ఈ టికెట్టు ఇచ్చేస్తే విశ్వం పరిస్థితి ఏమిటని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజల సమక్షంలోనే చేస్తానంటున్న చంద్రబాబు మాటలు కేవలం ప్రచారార్భాటానికే పరిమితమా? అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు జగ్గంపేట బీసీలకు కేటాయిస్తారనుకుని టీడీపీలో చేరామని, ఇప్పుడు ఇలా చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు ఏమని సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలని జగ్గంపేట అసెంబ్లీ టికెట్టు ఆశించిన పల్లా సత్యనారాయణ, కాకినాడ పార్లమెంటు సీటు ఆశించిన పోతుల విశ్వం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు పార్టీలో సముచిత స్థానం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తానని బాబు చెప్పారు. కానీ.. జిల్లాలో ఆ వర్గానికి ఇవ్వాల్సిన రామచంద్రపురం, కొత్తపేట నియోజకవరా్గాలను వలస వచ్చిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బండారు సత్యానందరావులకు ప్రకటించారు. దీనిపై కూడా పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. కొత్తపేట సీటు ఆశించిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండిచేయి చూపడంపై బీసీ సామాజికవర్గం మండిపడుతోంది. మరోపక్క రామచంద్రపురం టికెట్టు ఆశించి, భంగపడిన కట్టా సూర్యనారాయణ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో ఇటీవల చేరారు. -
ఉన్నా..ఉత్సవ విగ్రహాలే
సాక్షి, కాకినాడ :మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతూ గత నాలుగేళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ సర్కారుకు తెరపడింది. నాలుగుదశాబ్దాల తర్వాత రాష్ర్టం తిరిగి రాష్ర్టపతి పాలనలోకి వచ్చింది. శుక్రవారం నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జిల్లాల పాలనాపగ్గాలు పూర్తిగా కలెక్టర్ల చేతుల్లోకి వచ్చాయి. శాసనసభను సుప్తచేతనావస్థలో పెడుతూ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను తీసుకు రావడంతో ఎమ్మెల్యేలు అదే స్థితిలోకి వెళ్లనున్నారు. రాష్ర్టంలో ప్రజాకంటక పాలన సాగించిన ‘కిరణ్’ సర్కార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కారణంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై అనర్హత వేటువేయడంతో ఆయన ఇప్పటికే మాజీ అయ్యారు. కిరణ్ కేబినెట్లో పాడిపరిశ్రమ, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన పినిపే విశ్వరూప్ సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఈ శాఖలను కూడా జిల్లాకు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి తోట నరసింహంకు అప్పగించారు. రాష్ర్టపతి పాలన అమలులోకి రావడంతో ఆయన కూడా మంత్రి హోదా కోల్పోయి మాజీగా మిగిలిపోయారు. నోటిఫికేషన్ వస్తే మాజీలే.. తోటతో పాటు జిల్లాకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కూడా పదవులుండీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వీరికి కనీస గౌరవం దక్కుతుంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం మాజీలుగా మిగిలిపోతారు. ఈలోగా కేంద్రం మనసు మార్చుకొని రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుని, రాష్ర్టపతి పాలన ఎత్తివేస్తే అప్పుడు మళ్లీ వీరికి అధికారిక పగ్గాలు వస్తాయి. అప్పటి వరకు వీరు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు. అధికారులపై కనీసం పెత్తనం చెలాయించే అధికారం కూడా వారికి ఉండదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఎంపీలు పూర్తిగా కేంద్రానికి బాధ్యులై ఉంటారు. ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగే నామినేటెడ్ పదవులు, సర్పంచ్ పదవులకు కూడా ఎలాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి. మహానేత మరణ ంతో అస్థిరతకు బీజం.. తాను సముపార్జించిన అపార జనాభిమానంతో 2004లో కాంగ్రెస్‌కు ఘన విజయం చేకూర్చి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జన సంక్షేమానికే పెద్దపీట వేశారు. దాంతో ప్రజలు 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌కు అందలమిచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో మహానేత మనకు దూరమైనప్పటి నుంచీ కాంగ్రెస్ సర్కారు అస్థిరత పాలైంది. రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో రాష్ట్రం తిరోగమించింది. ప్రజా సంక్షేమం కొడిగట్టింది. కేంద్రంలో బీజేపీతో, రాష్ర్టంలో టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపిన కాంగ్రెస్ తెలుగుప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసింది. విభజనకు అన్ని విధాలా సహాయ సహకారాలందించిన కిరణ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో ఇంకా సమయం ఉండగానే పాలనాపగ్గాలను తీసుకెళ్లి రాష్ర్టపతి చేతులో పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన జిల్లా పాలన ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళుతుంది. రాజకీయ పలుకుబడులకు తెరపడుతుంది. గవర్నర్ నేతృత్వంలో కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగిస్తారు. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదల, పనుల మంజూరు.. ఇలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేంట్లోనైనా కలెక్టర్‌దే తుది నిర్ణయం. తుదిదినం.. తీరిక లేదు క్షణం కాగా రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని ముందే తెలియడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు చివరిరోజైన శనివారం క్షణం తీరిక లేకుండా.. తమ తమ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయానుసారం రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనకు ఆయన ఆమోదముద్ర శనివారం మధ్యాహ్నమే లభించింది. అయినప్పటికీ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు ‘చూరు పట్టుకుని వేలాడే బాపతు’ తాపత్రయంతో శనివారం రాత్రి కూడా అధికారిక హోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ‘తిరిగి ఎన్నికల బరిలో నిలిచినా జనం ఆదరిస్తారన్న నమ్మకం బొత్తిగా లేకపోవడంతోనే ఇలా చివరిరోజు ‘గడువు’ మీరి మరీ అధికారాన్ని వెలగబెట్టారు’ అని పలువురు వ్యాఖ్యానించారు. -
గోతుల నుంచి లక్షలు దండుకున్న..ఘరానా గారడీ
పిఠాపురం, న్యూస్‌లైన్ : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో అవినీతి తారాస్థాయికి చేరింది. జరగని నిర్మాణం జరిగినట్టు రికార్డులు సృష్టించి రూ.7 లక్షలు డ్రా చేసి పంచేసుకున్నారు. మండలంలోని వాకతిప్పలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ తరఫున రూ.25 లక్షలతో తలపెట్టిన భారత్ నిర్మాణ్ రాజీవ్‌గాంధీ సేవాకేంద్రానికి (స్త్రీశక్తి భవనం) 2011లో రాష్ట్ర మంత్రి తోట నరసిం హం, స్థానిక ఎమ్మెల్యే వంగా గీత శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ పునాదుల కోసం గోతులు తవ్వారు. అయితే నిర్మాణం గోతులను మించి అంగుళం ముందుకు వెళ్లకుండానే నిలిచిపోయింది. అనంతరం అదే స్థలంలో హస్తకళా ప్రదర్శన నిర్మాణానికి అంటూ ఎమ్మెల్యేయే మరో శంకుస్థాపన చేశారు. ‘ఇందులో గారడీ ఏముంది?’ అనిపించవచ్చు. కానీ, గోతులకే పరిమితమైన స్రీశక్తి భవనం నిమిత్తం రూ.7 లక్షలు వెచ్చించినట్టు చూపి, ఆ మొత్తాన్ని డ్రా చేశారు అధికారులు. అనుమతి లేకుండానే శంకుస్థాపన వాస్తవానికి గ్రామ పరిధిలో ప్రభుత్వ నిధులతో ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులదైతే వారు, పంచాయతీది అయితే పాలకవర్గం తీర్మానంతో నిర్మించేశాఖకు రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతినిస్తూ పాలకవర్గం తీర్మానించాలి. అప్పుడు మాత్రమే నిధులు మంజూరు చేయాలి. కానీ వాకతిప్పలో స్త్రీశక్తి భవన నిర్మాణం తలపెట్టిన పంచాయతీ స్థలానికి సంబంధించి ఎలాంటి తీర్మానమూ లేదు. అయినా శంకుస్థాపన చేయించి, నిర్మాణం జరుగుతున్నట్టు చూపి, లక్షలు బొక్కేశారు. దాని నిమిత్తం మహిళా సంఘం నుంచి రూ.3.40 లక్షలు, గ్రామ పంచాయితీ నిధుల నుంచి రూ.3.60 లక్షలు డ్రా చేశారు. సాధారణంగా ఎక్కడైనా నిర్మాణం ప్రారంభించి, కొంత పని పూర్తయ్యాకే ఆ పనికి తగ్గ నిధులు విడుదల చేస్తారు. అయితే ఇక్కడ స్థలం స్వాధీనం కాకుండానే, ఏ పనీ చేయకుండానే అధికారులు నిధులు విడుదల చేయడం గమనార్హం. ఇది జరిగి రెండేళ్లు అయినా అడిగిన వారే లేరు. కాగా అదే స్థలంలో 2013లో రూ.50 లక్షలతో తలపెట్టిన హస్తకళా ప్రదర్శనశాల నిర్మాణానికి ఎమ్మెల్యే వంగా గీత మరో శంకుస్థాపన చేసేశారు. శిలాఫలకాన్నీ ఆవిష్కరించారు. అనంతరం మొదటి శిలాఫలకాన్ని తొలగించేశారు. అంటే ఆ నిర్మాణానికి నీళ్లు వదిలినట్టే. మరి, డ్రా చేసిన రూ.7 లక్షలు ఏమయ్యాయి అన్న ప్రశ్నకు జవాబు లేదు. అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు పంచేసుకున్నారన్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. పనులు జరుగుతున్నాయని డబ్బులు డ్రా చేసిన జేఈ స్త్రీశక్తి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయని పంచాయితీరాజ్ జేఈ లిఖితపూర్వకంగా కోరిన మీదటే రూ.3.60 లక్షలు విడుదల చేశామని కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్ కుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా మెటీరియల్ కోసం నిధులు ఇవ్వక పోతే పనులు నిలిచిపోతాయని చెప్పడంతో రూ.3.40 లక్షలు విడుదల చేశామని మండల మహిళా సమాఖ్య కో ఆర్డినేటర్ తవుడు చెప్పారు. గోతులతో నిలిచిపోయిన ఆ నిర్మాణం నిమిత్తం డ్రా చేసిన రూ.7 లక్షలకూ ఎవరూ సమాధానం చెప్పడం లేదని వీరు అంటున్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓ జె.అరుణను వివరణ కోరగా పంచాయితీ రాజ్ పూర్వపు జేఈ సత్యనారాయణ నిధులు డ్రా చేసిన విషయం వాస్తవమేనన్నారు ఆ నిధులతో మెటీరియల్ తెప్పించామని చెప్పారని, కానీ ఆ మెటీరియల్ ఎక్కడుందో, ఆ నిధులు ఏమయ్యాయో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం అదే స్థలంలో వేరే భవన నిర్మాణం తలపెట్టినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా.. మొదట స్త్రీశక్తి భవనం నిర్మాణం కోసం అంటూ తవ్విన ఆ గోతులనే ఇప్పుడు హస్తకళా ప్రదర్శన శాల నిర్మాణం కోసం తవ్వినట్టు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకసారి గారడీ చేసి, లక్షలు దండుకున్న ఆ గోతుల నుంచే మరోసారి అవినీతి పంట పండించుకోవడానికి రంగం సిద్ధమవుతోందన్న మాట! -
2014లో సమైక్యాంధ్రగానే ఎన్నికలు
కాకినాడ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రగానే 2014లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్థక శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలం టూ మిగిలిన పార్టీలు చేస్తున్నవి కపట ఉద్యమాలేనని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ము, ధైర్యమున్న నాయకుడని, అందుకే బాహాటంగా ప్రజల మనోభావాలను వినిపించారన్నారు. కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా తాను తెలుగుదేశంలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నరసింహం పేర్కొన్నారు. తాత, తండ్రి, సోదరుడు అందరూ కాంగ్రెస్‌లోనే సేవ లందించారని, ఆ కుటుంబాల నుంచి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతానన్నారు. 2014లోనే కాక ఆ తరువాతా కాంగ్రెస్ నుంచే, జగ్గంపేట నుంచే పోటీ చేస్తానన్నారు. సీఎం కొత్తపార్టీ పెడతారన్న ప్రచారాన్నిఆయన కొట్టిపారేశారు. గర్వంగా ఫీలవ్వాలి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కలగడం గర్వంగా ఫీలవ్వాలని నరసింహం అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆయన పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు అందించిన చర్రిత కాంగ్రెస్‌కు ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సోనియా నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. మాజీ మంత్రి పీవీ రాఘవులు, హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కె. రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వి.సుజాత, జిల్లా ఐఎన్‌టీయూసీఅధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు పాల్గొన్నారు. -
రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ...ఇక ఈసీల జారీ
=పభుత్వం ఆదేశం =ఊపిరిపీల్చుకున్న జనం విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్)ల జారీలో కాస్త వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఈసీలు తదితర సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సడలింపు ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతకుముందు లాగానే ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వీటిని జారీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఉత్తర్వులు అందాయి. దీంతో రిజిస్ట్రేషన్స్ శాఖలో పెద్ద సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రజలు గతంలో మాదిరిగా వివిధ రకాల సేవలు పొందవచ్చని అందిన ఆదేశాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడాదిగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట... గత ఏడాది కాలంగా మీ సేవా కేంద్రాలలో ఈసీలు, దస్తావేజుల నకళ్లు జారీ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాటిని జారీ చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాంతో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈసీలు, దస్తావేజు నకళ్ల జారీ నత్తనడకన సాగుతోంది. ఈసీల కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈసీ కోసం దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో అవి పరిష్కారం కావటం లేదు. ఆన్లైన్లో అనేక సమస్యల వల్ల ఈసీ పొందటం గగనమవుతోంది. గతంలో ఈసీ పొందటానికి వంద రూపాయలలోపు ఖర్చు చేసేవారు. మీ సేవల్లో ఈసీ పొందటానికి కనీసం రూ.300 ఖర్చు అవుతోందని చెపుతున్నారు. దీంతోపాటు గంటల వ్యవధిలో పూర్తయ్యే ఈసీల జారీ ప్రక్రియ వారం.. పది రోజులు కూడా పడుతోంది. దస్తావేజుల నకళ్లు, దాఖలైన అర్జీలు మీ సేవల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉంటున్నాయి. వీటిన్నింటిపై ప్రజల నుంచి, రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అందిన విజ్ఞప్తులపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి తోట నరసింహం ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈసీలు, ఇతర సేవలు పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కొద్దిరోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్లో పొందుపరచనున్నారు. అనంతరం ఈసీలు, దస్తావేజు నకళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జారీ చేస్తారు. -
మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం - జనం తోపులాట
సీతానగరం, న్యూస్‌లైన్ : స్థానికంగా కల్వర్టు పునర్నిర్మాణం విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మధ్య గురువారం తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సీతానగరంలో సీనరేజీ నిధులతో చేపట్టే డ్రెయినేజి, రోడ్లు పనులకు శంకుస్థాపన, పాఠశాల, అంగన్వాడీ భవన (సింగవరం) ప్రారంభోత్సవానికి మంత్రి తోట వచ్చారు. సింగవరం నుంచి ఆయన తిరిగివస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సీతానగరం ఏటిగట్టు వద్ద మంత్రిని అడ్డుకున్నారు. మూడున్నరేళ్ల కిందట కూలిన కల్వర్టును ఇప్పటివరకూ నిర్మించలేదని వారు మంత్రిని నిలదీశారు. కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే వెంకటేష్ మంత్రి వాహనానికి అడ్డంగా బైఠాయిం చారు. కార్యకర్తలు, పోలీసు సిబ్బంది సహకారంతో మంత్రి తాత్కాలిక కల్వర్టు దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు తోసివేయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మూడు సార్లు కల్వర్టు విషయం, మిర్తిపాడు, బొబ్బిల్లంకల మధ్య తొర్రిగడ్డ కాలువపై కాజ్వే విషయం తెలిపినా మంత్రి పట్టించుకోలేదని పెందుర్తి విమర్శించారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ కదలనివ్వబోమన్నారు. మంత్రి స్పందిస్తూ, అసమర్థ ఎమ్మెల్యే కనుకే పనులు చేయించుకోలేకపోతున్నావని మండిపడ్డారు. ధర్నాలు, రాస్తారోకోలు తప్ప పనులు చేయించుకోవడం రాదని ఎద్దేవా చేశారు. అనంతరం మంత్రి కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. రెండు నెలల్లో సీతానగరం ఏటిగట్టు వద్ద కల్వర్టును, బొబ్బిల్లంక, మిర్తిపాడు రోడ్లో కాజ్వే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేతకాదన్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికే తనను అడ్డుకున్నారన్నారు. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ బొల్లిన సుదాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వలవల రాజా, టీపీ స్కీమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాండ్రు శ్రీను, పీఏసీఎస్ అధ్యక్షుడు పెందుర్తి నాగరత్నం పాల్గొన్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక ఈసీలు, సీసీలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)లు, సర్టిఫైడ్ కాపీలు(సీసీ-దస్తావేజు నకళ్లు) ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం ఆదేశించారు. ప్రస్తుతం ఈసీలు, సీసీలు కేవలం మీసేవా కేంద్రాల్లోనే ఇస్తున్నారు. అయితే మీసేవా కేంద్రాల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులతోపాటు, 1990కి ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములకు సంబంధించిన నకళ్ల జారీలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. దీంతో ఆయా దరఖాస్తుదారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళుతున్నారు. అయితే దరఖాస్తుదారులు వస్తున్నా సబ్రిజిస్ట్రార్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సబ్రిజిస్ట్రార్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కర్, స్థితప్రజ్ఞలు మంగళవారం మంత్రి తోట నరసింహంను కలిసి.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసీలు, సీసీలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ ఇద్దరికీ మరింత సెగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్ గురువారం సమైక్యాంధ్ర కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని హైదరాబాద్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ పునరాలోచన చేసి, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే పార్టీలో కొనసాగుతానని, అందుకు నవంబర్ ఒకటోతేదీ డెడ్‌లైన్ అని చెప్పారు. అప్పటికీ విభజనపై కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోతే పార్టీకి కూడా గుడ్‌బై చెపుతానన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందచేసి తక్షణం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వరూప్ రాజీనామా చేయడంతో జిల్లాలో మరో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజుల మాటేమిటని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మంత్రి పదవులను పట్టుకు వేలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు తోట, పినిపే ఆగస్టు నెల మొదట్లో వారం రోజుల తేడాలో రాజీనామా చేశారు. అయితే రాజీనామాలను ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్‌కు అందచేశారు. కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు రాజీనామా మాట అటుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన తరువాత కనీసం జిల్లావైపు కన్నెత్తి చూడనేలేదు. రాష్ట్ర మంత్రుల రాజీనామాలను సమైక్యవాదులు రాజీడ్రామాలుగా అభివర్ణిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జిల్లాలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విశ్వరూప్ రాజీనామాతో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కూడా విశ్వరూప్ తెలిపారు. కాగా, విశ్వరూప్ రాజీనామా చేయడంతో తోట నరసింహం రాజీనామా కోసం సమైక్యవాదులు ఎదురు చూస్తున్నారు. తాను ప్రారంభంలోనే రాజీనామా చేశానని మంత్రి తోట చెపుతున్న మాటలకు విశ్వసనీయత లేదని వారు విమర్శిస్తున్నారు. 15 రోజులుగా మంత్రి తోట ఎక్కడకు వెళితే అక్కడ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. తాను రాజీనామా చేశానని చెపితే సరిపోదని, విశ్వరూప్ మాదిరిగా రాజీనామాను గవర్నర్‌కు అందచేసి ఆమోదింపజేసుకోవాలని ఇప్పుడు సమైక్యవాదులు తోటను డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ తోట రాజీనామా డ్రామాగానే మిగులుతుందంటున్నారు. పళ్లంరాజు ఏం చేస్తారో? మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 58 రోజుల్లో ఏ ఒక్క రోజూ కేంద్ర మంత్రి పళ్లంరాజు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయారు. పైకి మాత్రం సమైక్యాంధ్ర ముందు తన మంత్రి పదవి పెద్ద విషయం కాదని చెప్పుకొన్నారు. కానీ మంత్రి పదవిని వదల్లేక, సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి ఢిల్లీకే పరిమితమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం వెనక్కు తీసుకుంటుందని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్, ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు పదేపదే చెపుతున్నా పళ్లంరాజు స్పందించకపోవడం సమైక్యాంధ్రపై ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని జిల్లా జేఏసీ ప్రతినిధులంటున్నారు. ప్రజాప్రతిఘటన ఎదురైనా మిగిలిన కేంద్ర మంత్రులు తమ జిల్లాల్లో ఏదో సందర్భంలో పర్యటించినా పళ్లంరాజు ఆ సాహసం చేయలేదు. ఆయన జిల్లాలో అడుగుపెడితే తరిమికొట్టాలని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా పలువురు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో గురువారం పళ్లంరాజు సోనియాగాంధీతో 20 నిమిషాల సేపు జరిపిన భేటీలో ఏ విషయాలు చర్చించారు, సమైక్యాంధ్ర కోసం అసలు ఏమైనా మాట్లాడారా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన పదవిని వదులుకుంటారా లేక, పదవిని అంటిపెట్టుకుని ఢిల్లీకే పరిమితమవుతారో వేచి చూడాల్సిందే. -
తోట వాణి నిరాహార దీక్ష భగ్నం
-
వైద్యాధికారిణి పద్మావతిపై దాడి
తూ.గో: మంత్రి తోట నరసింహ అనుచరులు వీరంగ సృష్టించారు. జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారిణిపై మంత్రి అనుచరులు బుధవారం దాడికి దిగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న మంత్రి సతీమణి వాణికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పద్మావతిపై పేడ, వాటర్ ప్యాకెట్లతో దాడి చేయడంతో షాక్ గురైన ఆమె పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తుంటే ఇప్పుడా వచ్చేది అని నిలదీసిన మంత్రి అనుచరులు ఆమెను నిర్భందించేందుకు యత్నించారు. దీంతో చేసేది లేక వైద్యాధికారిణి వెళ్లిపోయారు. అంతకుముందుమంత్రి సతీమణి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. సమైక్యవాదులు పోలీసులను అడ్డుకోవడంతో ఆమె దీక్ష యథావిధిగా కొనసాగిస్తున్నారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి సతీమణి దీక్ష
కాకినాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణీ శనివారం కాకినాడలో ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. వాణీ దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యేలు వంగా గీతా, శేషారెడ్డి, పంతం గాంధీ మోహన్ చేరుకుని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలని వాణీ పిలుపు నిచ్చారు. చిన్నారులు సైతం సమైక్యవాదం వినిపిస్తూ పోరుబాట పడుతున్నారని అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని టీవీలు చూసే పెద్దలు సైతం ఉద్యమంలో పాల్గోవాలని వాణీ కోరారు. ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని సమైక్యవాద ఉద్యమకారులకు వాణీ విజ్ఞప్తి చేశారు సమైక్యాంధ్రకు మద్దతుగా కాకినాడలో జర్నలిస్టులు వినూత్న నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట మూడు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు.. ఇవాళ వేదపండితులతో యాగాలు నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ పూజలు నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి జూనియర్ డాక్టర్లు మద్దతు పలికారు. యాగం చుట్టూ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో వరుసగా 11రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా ప్రజాసంఘాలు, విద్యా సంస్థలు, వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో విద్యార్థులు, టీచర్లు మానవహరంగా ఏర్పడి... సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏలూరు ఆటోమోబైల్ మెకానిక్స్ భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమైక్య నినాదాలతో తిరుపతి హోరెత్తుతోంది. అన్ని వర్గాల వారు ఉద్యమ బాట పట్టడంతో.. 11రోజులుగా జనజీవనం స్తంభించింది. కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలుచోట్ల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఓరియంటల్ కళాశాల ఎదుట సమైక్యవాదులు సకలజనుల సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, సినీ నటులు, వైద్యులు, అధ్యాపకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ర్టవిభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని వైస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ ని ప్రధానిని చేసేందుకు, రాష్ర్టాన్ని విభజించాలను కోవడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని సోనియాగాంధీ వెనక్కి తీసుకోవాలని లేదంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని నాయకులు హెచ్చరించారు. సమైక్య ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కంచరపాలెం మెట్టులో ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్సనతో రిలేదీక్షలు చేపట్టారు. సమైక్యవాదుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. -
మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా
హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అందచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తోట నర్సింహం రాజీనామాను సమర్పించారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందచేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీమాంధ్రలో తొమ్మిదో రోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, మానవ హారాలతో సీమాంధ్ర ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
వీరవరంలో మంత్రి తోట నర్సింహం వీరంగం