తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు.
వీరవరం: తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తోట నర్సింహం తీరుతో వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో వీరవరంలో భారీగా పోలీసులను మొహరించారు.
చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాకినాడ ఎంపీ ఎన్నికల్లో తోట నర్సింహం గెలిచారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రాదేశిక ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరవరంలో ఆయనకు 875 ఓట్లు పడగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌కు 2,075 ఓట్లు పడ్డాయి. స్వగ్రామంలోనే ప్రత్యర్థికి ఆధిక్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరసింహం వీధి రౌడీలా మారిపోయారు. ఎంపీనన్న సంగతి మరిచి గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు.