Veeravaram
-
మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి.. ఇనుపరాడ్డుతో దాడి
ప్రత్తిపాడు: చికెన్ పకోడి బడ్డీ వద్ద జరిగిన స్వల్ప వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. వివరాలివి..తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలోని జెడ్పీ స్కూల్ సమీపంలో సింగం ఏసు చికెన్ పకోడి బడ్డీ పెట్టుకుని బతుకుతున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పదో తరగతి చదివే కుమారుడు శివ (15) రోజూ తండ్రి బడ్డీ వద్ద చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు మద్యం మత్తులో బడ్డీ వద్దకు వచ్చాడు. చిన్న విషయంలో ఏసుతో తగవు పడ్డాడు. కోపోద్రిక్తుడైన వీరబాబు తన కారుతో బడ్డీని ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఇనుపరాడ్డుతో ఏసు..అతని కుమారుడిపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన శివను కాకినాడ తరలించగా అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు వీరవరంలో పికెట్ ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడి ఎస్ఐ ఎస్.అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేయాల్సి ఉంది. -
చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
తాను అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను ఒంటి చేత్తో కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు సొంత పార్టీ నాయకులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకముందే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. ఎంపీగా నెగ్గిన టీడీపీ నాయకుడే స్వయంగా దాడులకు దిగినా పచ్చ పార్టీ అధినేత మిన్నకుండిపోయారు. కనీసం దాడులను ఖండించిన పాపాన పోలేదు. సొంతూరులో తనకు ఆధిక్యం దక్కలేదన్న అక్కసుతో కాకినాడ ఎంపీగా ఎన్నికైన టీడీపీ నేత తోట నరసింహం తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై గూండాల్లా దాడులకు తెగపడ్డారు. ‘వైఎస్సార్సీపీకి పనిచేస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ పెద్దాపురం మండలం దివిలి ఎస్సీ పేటలో ఇళ్లల్లోకి చొరబడి తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గాజులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు లాక్కొచ్చి మరీ చితక బాదారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని పొట్టపై విచక్షణారహితంగా తన్నడంతో ఆమె ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా భావపురిలో టీడీపీ కార్యకర్తలు కత్తులు చేతబట్టి కారులో స్వైరవిహారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తమ్ముళ్ల ఘాతుకాలకు అంతే లేదు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నుంచి కనీస స్పందన కరువయింది. సొంత పార్టీవారే దాడులకు తెగబడుతున్నా టీడీపీ అధినేతలో చలనం శూన్యం. శాంతి భద్రతలను కాపాడడమంటే ఇదేనా అని నిలదీస్తున్న బాధితులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? -
దీక్ష విరమించిన తోట గాంధీ
వీరవరం : తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ సిపి నేత తోట గాంధీ దీక్ష విరమించారు. రెండు రోజుల్లో ఎంపీ తోట నర్సింహంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. అంతకు ముందు తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తోట గాంధీని పరామర్శించారు. తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తోట గాంధీ ఈ ఉదయం ఇక్కడ నిరాహారదీక్ష చేపట్టారు. వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. పరిస్థితి విషమించడంతో తోట నర్సింహంపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు గాంధీ చేత దీక్ష విరమింపజేశారు. -
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
-
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
వీరవరం: తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తోట నర్సింహం తీరుతో వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో వీరవరంలో భారీగా పోలీసులను మొహరించారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాకినాడ ఎంపీ ఎన్నికల్లో తోట నర్సింహం గెలిచారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రాదేశిక ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరవరంలో ఆయనకు 875 ఓట్లు పడగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌కు 2,075 ఓట్లు పడ్డాయి. స్వగ్రామంలోనే ప్రత్యర్థికి ఆధిక్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరసింహం వీధి రౌడీలా మారిపోయారు. ఎంపీనన్న సంగతి మరిచి గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు.