
దీక్ష విరమించిన తోట గాంధీ
వీరవరం : తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ సిపి నేత తోట గాంధీ దీక్ష విరమించారు. రెండు రోజుల్లో ఎంపీ తోట నర్సింహంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. అంతకు ముందు తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తోట గాంధీని పరామర్శించారు.
తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తోట గాంధీ ఈ ఉదయం ఇక్కడ నిరాహారదీక్ష చేపట్టారు. వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. పరిస్థితి విషమించడంతో తోట నర్సింహంపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు గాంధీ చేత దీక్ష విరమింపజేశారు.