2014లో సమైక్యాంధ్రగానే ఎన్నికలు
Published Sun, Dec 29 2013 2:51 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
కాకినాడ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రగానే 2014లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్థక శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలం టూ మిగిలిన పార్టీలు చేస్తున్నవి కపట ఉద్యమాలేనని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ము, ధైర్యమున్న
నాయకుడని, అందుకే బాహాటంగా ప్రజల మనోభావాలను వినిపించారన్నారు.
కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా
తాను తెలుగుదేశంలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నరసింహం పేర్కొన్నారు. తాత, తండ్రి, సోదరుడు అందరూ కాంగ్రెస్‌లోనే సేవ లందించారని, ఆ కుటుంబాల నుంచి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతానన్నారు. 2014లోనే కాక ఆ తరువాతా కాంగ్రెస్ నుంచే, జగ్గంపేట నుంచే పోటీ చేస్తానన్నారు. సీఎం కొత్తపార్టీ పెడతారన్న ప్రచారాన్నిఆయన కొట్టిపారేశారు.
గర్వంగా ఫీలవ్వాలి
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కలగడం గర్వంగా ఫీలవ్వాలని నరసింహం అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆయన పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు అందించిన చర్రిత కాంగ్రెస్‌కు ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సోనియా నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. మాజీ మంత్రి పీవీ రాఘవులు, హస్త
కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కె. రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వి.సుజాత, జిల్లా ఐఎన్‌టీయూసీఅధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement