కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం, సీఎం చంద్రబాబు నాయుడు(పాత చిత్రం)
అమరావతి: టీడీపీ కాకినాడ ఎంపీ తోట నరసింహం పార్టీ మారనున్నారని పుకార్లు గుప్పుమనడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో తోట నరసింహం భార్య తోట వాణి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను వైఎఎస్సార్‌సీపీ గుర్తుపై గతంలో గెలిచిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించారు. అదే విషయమై తోట వాణి, చంద్రబాబును కలిశారు. తోట కుటుంబానికి చంద్రబాబు ఏం హామీ ఇచ్చారనేది మిస్టరీగా మారింది.
అలాగే అరకు పార్లమెంటు పరిధిలోని నేతలతో కూడా చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్ కుమారుడు ఆర్‌పీ భాంజ్ దేవ్‌కు సాలూరు టికెట్ దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అదే టికెట్ ఆశించిన సంధ్యారాణికి ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సంధ్యారాణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment