స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గురువారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి అందచేశారు.
హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గురువారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి అందచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తోట నర్సింహం రాజీనామాను సమర్పించారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందచేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీమాంధ్రలో తొమ్మిదో రోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, మానవ హారాలతో సీమాంధ్ర ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.