కాకినాడ ఎంపీ తోట నర్సింహం(పాత చిత్రం)
కాకినాడ: ఈవీఎంలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుమానం కలగడం హాస్యాస్పదమని కాకినాడ ఎంపీ తోట నర్సింహం విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తోట నర్సింహం విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికలతో పాటుగా నంద్యాల ఉప ఎన్నికలు.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎంలపైనే జరిగాయని, ఆ ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది..అప్పుడు రాని అనుమానం ఇప్పుడు ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. చాలా అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి కుంటిసాకులతో ప్రజలను మభ్యపెట్టడం సరైనది కాదన్నారు.
వైఎస్ జగన్‌ను ఒక్కసారి చూడాలన్న తలంపు ప్రజల్లో వచ్చిందని, అందుకే 80 శాతం పోలింగ్ జరిగిందని అభిప్రాయపడ్డారు. నిజంగా ఈవీఎంలపై అనుమానం వస్తే ప్రజలే గగ్గోలు చేసేవారని వ్యాక్యానించారు. చంద్రబాబు పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లుగానే భావిస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment