ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి కోస్తా జిల్లాల్లో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.