
అమాయకమైన మొహం, ఎర్ర నిక్కర్‌లో చేయిపెట్టుకుని బుట్టబొమ్మలా కనిపిస్తున్నా ఈ చిన్నారిని మీరు గుర్తు పట్టగలరా? ఈ చిన్నారి ఎవరోనని ఊహించే ప్రయత్నం చేసి విఫలమయ్యారా? ‘పద్మావతి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకునే చిన్ననాటి చిత్రం ఇది. రాణీ పద్మావతిగా నటించిన దీపిక.. తన చిన్ననాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాక ఈ ఫొటోలో దీపిక పక్కన నిలుచున్న కుర్రాడి పేరు ఆదిత్య నారాయణ్. అతనికి సైతం ఈ ఫొటోను దీపిక ట్యాగ్ చేసింది.
చిన్ననాటి ఫొటోతో పాటు ఈమధ్య పెళ్లి చేసుకున్న ఒక స్నేహితుడి ఫొటోను సైతం దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఎర్ర చీర కట్టుకుని, పెద్ద ఇయర్‌రింగ్స్‌తో అప్సరసలా దీపిక కనిపిస్తోంది. దీపిక పోస్ట్ చేసిన ఈ రెండు ఫొటోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment