కుటుంబంలో తలెత్తిన సమస్యలు ఓ వృద్ధ దంపతులను ఆత్మహత్యకు పురిగొల్పాయి.
కుటుంబంలో తలెత్తిన సమస్యలు ఓ వృద్ధ దంపతులను ఆత్మహత్యకు పురిగొల్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని నీలకంఠంవారి వీధిలో ఉంటున్న శివరామయ్య, పద్మావతి దంపతులు మంగళవారం ఉదయం పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శివరామయ్య చనిపోగా పద్మావతి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.