సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఫలితాలు భారతీయ జనతాపార్టీలో కొత్త జోష్‌ని నింపాయి. ఈ ఫలితాలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు, విశ్వాసానికి ఇవే నిదర్శనమని పేర్కొన్నారు. మొత్తం 16 మేయర్ సీట్లలో 14 బీజేపీ విజయం సాధించడమే ఇందుకు తార్కాణం అని చెప్పారు. ప్రజల విశ్వాసానికి బీజేపీ దగ్గరగా ఉందని చెప్పడానికి ఇదే సాక్ష్యమని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఒక్కసీటు కూడా సాధించలేదని ఆయన అన్నారు. గుజరాత్ విజయం సాధించడం భారతీయ జనతాపార్టీకి ఎప్పడూ ముఖ్యమేనని చెప్పిన ఆయన... ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ గుజరాత్ అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
మన్మోహన్‌పై విసుర్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పోల్చుతూ తీవ్ర విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ పీఎం కార్యాలయంలో మాత్రమే ప్రధాని అని.. బయట ఆయనకు ఎటువంటి అధికారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్ పాలన అత్యంత అవినీతి మయమని ఆయన చెప్పారు.
బీజేపీ హిందుత్వ పార్టీ
బారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నుంచి హిందూ అనుకూల పార్టీగా నిలిచిందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కొత్తగా హిందుత్వ పార్టీగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. హిందువుల ఓట్ల కోసమే గుజరాత్‌లోని ఆలయాలను సందర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే గుజరాత్‌లో ఆలయాల చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్న సమయంలో జైట్లీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
పద్మావతిపై..!
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావతి’ చిత్రంపై అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పద్మావతి చిత్రం ప్రస్తుతం సెన్సార్ బోర్డు పరిధిలో ఉందని.. దానిపై సెన్సార్ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment