తమిళసినిమా: బాలీవుడ్ భారీ చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై ఉత్తరాదిలో రచ్చరచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకొనే పద్మావతిగా టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.అయితే చరిత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామంటూ ఉత్తరాదిలో ఆందోళనలు ఇప్పటికే మిన్నంటుతున్నాయి. అందులో నటించిన నటి దీపికాపడుకొనేను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ సెగలిప్పుడు తమిళనాడును తాకుతున్నాయి. ఈ చిత్ర విడుదలను హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
విశ్వ హిందు పరిషత్ కోవై జిల్లా అధ్యక్షుడు శివలింగం,రాష్ట్రీయ రాజపుత్ర కర్ణి సేన అఖిల భారత అధ్యక్షుడు సుబ్‌దేవ్‌గిల్ శుక్రవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పద్మావతి చిత్రంలో రాజస్థాన్ రాణి గురించి అవాస్తవ సన్నివేశాలను పొందుపరచారన్నారు.ఇది చరిత్రను తప్పుగా చిత్రీకరించడమే అవుతుందన్నారు. అలాంటి దృశ్యాలతో హిందూ సమాజాన్ని కించపరచడమేనన్నారు. ఈ చిత్ర విడుదలను తమిళ ప్రభుత్వం నిషేధించాలని, లేని పక్షంలో పద్మావతి చిత్ర ప్రదర్శనల థియేటర్ల ముందు ఆందోళనలు వంటి పలు రకాల పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment