మరదలికి టికెట్ ఓకే!
సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పటివరకు నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్‌కు టికెట్ దక్కింది.
సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పటివరకు నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్‌కు టికెట్ దక్కింది. అది కూడా ఆమె ఎప్పటినుంచో ఆశిస్తున్న లక్నో కంటోన్మెంట్ టికెట్‌నే ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. దాంతో అక్కడ ఆమె.. కాంగ్రెస్ నుంచి ఈమధ్యే బీజేపీలో చేరిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషిని ఢీకొనబోతున్నారు.
అపర్ణకు టికెట్ ఇస్తున్న విషయాన్ని సోమవారం మధ్యాహ్నం అఖిలేష్ ప్రకటించారు. ఇప్పటివరకు అసలు ఆ స్థానంలో బోణీ కొట్టని సమాజ్‌వాదీకి.. ఇప్పుడైనా అవకాశం దక్కుతుందేమోనని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన అపర్ణా యాదవ్.. దాదాపు ఏడాది నుంచి లక్నో కంటోన్మెంట్ స్థానంలో తిరుగుతూ, అక్కడ పట్టు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.