
లక్నో: నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని పార్లమెంటులో ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పేర్కొనడం దేశ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో, మోదీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేందుకు మహాకూటమిగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ.. సాక్షాత్తూ లోక్‌సభలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ములాయం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు రుసరుసలాడుతుండగా.. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ములాయం వ్యాఖ్యలను సమర్థించారు. ‘ఆయన వ్యాఖ్యల వెనుక కారణం ఉండి ఉంటుంది. ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా ఆయన ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు అందజేశారు. పెద్దవారు దీవెనలు ఇవ్వడం పరిపాటే. ఆశీర్వాదాలు ఇచ్చినంత మాత్రాన ఎన్నికలు గెలిచినట్టు కాదు. అందుకు ఎంతో శ్రమ కావాలి. ఆయన శుభాశీస్సులు అందరి వెంట ఉంటాయి’ అని అపర్ణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment