
రాజకీయాల్లోకి మరో వారసురాలు
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ ఇంట్లో నుంచి మరో వారసురాలు రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్నారు. ములయాం చిన్న కోడలు అపర్ణా యాదవ్ వచ్చే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అపర్ణకు పార్టీ టికెట్ కేటాయించినట్టు ఎస్పీ అధికార ప్రతినిధి, ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ వెల్లడించారు. సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అపర్ణ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ అయిన అరవింద్ సింగ్ బిస్త్ ఉత్తరప్రదేశ్ సమాచార కమిషనర్గా పనిచేస్తున్నారు.
ములయాం కుటుంబం నుంచి పలువురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ములయాం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి కాగా, పెద్ద కోడలు డింపుల్ యాదవ్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక ములయాం దగ్గరి బంధువులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు.