
‘ఆయన మానాన్నే.. కానీ పోరు తప్పదు’
లక్నో: ‘ఆయన మా నాన్నే.. కానీ ఈ సమయంలో పోరాటం తప్పనిసరి. ఆనందం ఆవిరైపోతుందని కొన్ని విషయాలు ఆయన పక్కన పెట్టిన ప్రతి చోట ఎలాంటి విజయం లేకుండా పోయింది. అందుకే.. ఇప్పుడు పోరాటం తప్పదు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు.
సమాజ్‌వాది పార్టీని, పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ సోమవారం అఖిలేశ్ యాదవ్ చేతుల్లో పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్లుగా ములాయం చేతిలో ఉన్న ఆ పార్టీ అనూహ్యంగా కొడుకు చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఓ మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. ‘ఆయన(ములాయం) మా నాన్న.. ఎన్నికల కమిషన్ తీర్పు ఇవ్వగానే ఆయన వద్దకు వెళ్లి కలిశాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు.