ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్లు ఇస్తాం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేద మహిళలకు ప్రెషర్ కుకర్లను ఇస్తామని చెప్పారు. ఆదివారం లక్నోలో ఆయన ఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలేష్ భార్య, డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా, మేనిఫెస్టోలో ప్రజాకర్షణ పథకాలను చేర్చారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే..
- గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా
- కోటిమంది పేద మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ
- బస్సుల్లో మహిళలకు ప్రయాణ టిక్కెట్లపై 50 శాతం రాయితీ
- సమాజ్వాదీ స్మార్ట్ఫోన్ యోజన పథకం పేరుతో పేదలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు
- విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేద మహిళలకు ఉచితంగా ప్రెషర్ కుకర్లు
- చేనేత, హస్తకళల పరిశ్రమలను అభివృద్దికి కృషి
-
లక్నో విమానాశ్రయంలో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు