మాజీ సీఎం విద్యుత్‌ బకాయి రూ.4 లక్షలు | Mulayam Yadav has electricity bill worth Rs 4 lakh | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం విద్యుత్‌ బకాయి రూ.4 లక్షలు

Published Fri, Apr 21 2017 3:44 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

మాజీ సీఎం విద్యుత్‌ బకాయి రూ.4 లక్షలు - Sakshi

మాజీ సీఎం విద్యుత్‌ బకాయి రూ.4 లక్షలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వీఐపీ సంస్కృతికి చెక్‌ పెట్టడంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది మొండి బకాయిలను వసూలు చేసేందుకు తనిఖీ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ 4 లక్షల రూపాయలు విద్యుత్‌ బిల్లు చెల్లించలేదని గుర్తించారు.

ఎతావ్‌లోని ములాయం ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. రోజుకు 5 కిలోవాట్‌ల విద్యుత్‌ వాడేందుకు అనుమతి ఉండగా, ములాయం ఇంట్లో ఎనిమిది రెట్లు ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించారు. ఈ నెలలోపు విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని అధికారులు గడువు విధించారు. ములాయం సొంత నియోజకవర్గమైన ఎతావ్‌లో సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆయనకు సువిశాలమైన బంగ్లా ఉంది. 12 గదులు ఉన్న ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్‌ ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement