లోక్‌సభ ఎన్నికల తరుణంలో సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన కీలక నేతలు బీజేపీ చేరారు.
సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌబే, బలరామ్ యాదవ్, జగత్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే, పలువురు జిల్లా అధ్యక్షులు ఈరోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీపై ప్రజలకు చేరువైంది. ఆయన నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాం. అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పాఠక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment