దేశంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనను అంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
మిమ్మల్ని ప్రాదేయపడుతున్నాను
‘గతంలో అనేక మంది నేతలు నిరంకుశ పాలన సాగించారు. కానీ దేశ ప్రజలు అలాంటి వారికి అధికారాన్ని దూరం చేశారని అన్నారు. ఓ నియంత ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. అయితే ఆ పోరాటాన్ని నేను ఒంటరిగా చేయలేను. నాకు 140 కోట్ల మంది భారతీయుల మద్దతు కావాలి. మిమ్మల్ని ప్రాదేయపడుతున్నాను. నాకు అండగా నిలవండి’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "...Whenever a dictator tried to take over, the people of the country uprooted him. Today again a dictator wants to end democracy...I am fighting against that dictator but I cannot do anything alone. I have come to beg from 140 crore people… pic.twitter.com/rLnnGXjbwA
— ANI (@ANI) May 11, 2024
75కి మోదీ వయస్సు
ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్ధులే లేరన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు..బీజేపీలో నేతల పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75కి చేరుతుందన్నారు.
బీజేపీని ఒకటే అడుగుతున్నా
బీజేపీని ఉద్దేశిస్తూ వారు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్ధి ఎవరని ప్రశ్నిస్తున్నారు. కానీ నేను వాళ్లని ఒకటే అడగాలని అనుకుంటున్నాను. బీజేపీలో పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75 దాటుతుంది అని అన్నారు.
బీజేపీకి ఓటమి ఖాయం
ఇక ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంతో ఉన్న బీజేపీ.. అధికారం కోల్పోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 220-230 లోక్‌సభ సీట్లు కూడా దాటవన్న ఆయన హర్యానా, రాజస్థాన్,కర్ణాటక, ఢిల్లీ, బీహార్,మహరాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్‌లో లోక్‌సభ సీట్లను కోల్పోతుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment