బలప్రదర్శనకు దిగిన ములాయం! | Mulayam Singh Yadav and Shivpal Yadav leave for Delhi | Sakshi
Sakshi News home page

బలప్రదర్శనకు దిగిన ములాయం!

Published Sun, Jan 8 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

బలప్రదర్శనకు దిగిన ములాయం!

బలప్రదర్శనకు దిగిన ములాయం!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు విషయమై ఇటు ములాయం, అటు అఖిలేశ్‌ వర్గాల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎస్పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు తనవైపే ఉన్నారని, కాబట్టి ఆ పార్టీ సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని అఖిలేశ్ వర్గం బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అఖిలేశ్‌ బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి 'ఆధారాల'ను కూడా చూపెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని కోరింది.

అయితే, ఎస్పీకి ప్రతీక అయిన సైకిల్‌ గుర్తును వదులుకోవడానికి ములాయం ఎంతమాత్రం సిద్ధపడటం లేదు. ఈ విషయంలో కొడుకు అఖిలేశ్‌తో అమీ-తుమీకి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం ఆదివారం ఉదయమే కొడుకు అఖిలేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ వెంటనే లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి సోదరుడు శివ్‌పాల్‌ యాదవ్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ములాయం మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ్ముడు శివ్‌పాల్‌తోపాటు తన వర్గం కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. అఖిలేశ్‌కు పోటీగా తన బలప్రదర్శన చాటుకోవడానికి ఈ భేటీని ములాయం వర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ములాయం, శివ్‌పాల్‌ ఢిల్లీకి తరలివెళ్లారు. పార్టీ గుర్తుపై ఈసీని కలిసి ఎట్టిపరిస్థితుల్లో తమ వర్గానికే దక్కేలా చూడాలని ములాయం వర్గం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement