లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్.. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శివపాల్ యాదవ్ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా సీఎం అఖిలేష్ యాదవ్కు ములాయం చెప్పినట్టు సమాచారం. అయితే శివపాల్తో పాటు ఉద్వాసనకు గురైన మరో ముగ్గురు మంత్రుల మాటేంటన్న ప్రశ్న ఎస్పీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిని కూడా మళ్లీ కేబినెట్లోకి తీసుకోవాల్సిందిగా ములాయం తన కుమారుడికి చెప్పారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కాగా శివపాల్ అనుచరుడు, ఎమ్మెల్సీ అశు మాలిక్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మంత్రి పవన్ పాండేను తొలగించాలని అఖిలేష్కు ములాయం సూచించినట్టు తెలుస్తోంది.
అఖిలేష్ తన బాబాయ్ శివపాల్తో పాటు నలుగురు మంత్రులను ఆదివారం తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే అమర్ సింగ్కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని అఖిలేష్ ఆరోపించారు. అదే రోజు అఖిలేష్కు మద్దతుగా ఉన్న సమీప బంధువు రాంగోపాల్ యాదవ్ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో, ములాయం కుటుంబంలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.
ఆ ముగ్గురు మంత్రుల మాటేంటి?
Published Tue, Oct 25 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
Advertisement