‘నేను అసలు ఏ పార్టీ పెట్టట్లేదు’
ఆ రోజు ఏవో కోపంతో మాటలు అని అర్ధం వచ్చినట్లుగా ఆయన బదులిచ్చారు. ఎప్పటికీ తన సోదరుడు ములాయంతోనే ఉండిపోతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితా తేది మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కొడుకు చేసిన చర్యలపై తొలుత అలకబూనిన ములాయం ఆ వెంటనే అందులో నుంచి బయటకు రావడమే కాకుండా కాంగ్రెస్, ఎస్పీలు విజయం సాధిస్తాయని స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు శివపాల్ ఏదో కోపంలో ఆ రోజు పార్టీ పెడతానని, అన్నాడేగానీ నిజానికి అలాంటిదేమీ లేదని చెప్పారు. దీనికి కొనసాగింపుగానే తాజాగా శివపాల్ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.