శివపాల్ సన్నిహితులపై వేటు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. శివపాల్ యాదవ్‌కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై వేటు పడింది. మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, కల్లు యాదవ్, రాజేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్ సహా ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.
'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ తమ్ముడు, శివపాల్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులపై వేటు వేయడం గమనార్హం. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం. తన కొడుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ధ్వజమెత్తారు.