ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఎస్పీ అంగీకరించింది. కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చెప్పారు.
Published Sun, Jan 22 2017 1:22 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement