అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments Over Telangana Politics | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారు.. 2025లో ప్రజల్లోకి వస్తారు: కేటీఆర్‌

Published Thu, Oct 31 2024 7:55 PM | Last Updated on Thu, Oct 31 2024 7:55 PM

BRS KTR Sensational Comments Over Telangana Politics

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున సోషల్‌ మీడియా(ట్విట్టర్‌) వేదికగా  ‘ఆస్క్‌ కేటీఆర్‌’ (#ASKKTR) పేరుతో ఈరోజు సాయంత్రం నుంచి నెటిజన్లతో కేటీఆర్‌ ముచ్చటించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, నెటిజన్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

#ASKKTR కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. దేశం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చీప్‌ పాలిటిక్స్‌ చేయలేదు. నా రాజకీయ జీవితంలో నా కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నాను. కానీ ప్రజల కోసం నిలబడి.. పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను.

 

ఇదే సమయంలో కేసీఆర్‌ ఆరోగ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేసీఆర్‌ కొంత సమయం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదు.

అలాగే, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి.. తర్వాత పార్టీ మారిన నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. పార్టీ మారిన పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్‌ఎస్‌ నేతలే విజయం సాధిస్తారని అన్నారు. 

మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎందుకు పోటీ చేయకపోవడంపై ఓ నెటిజన​్‌ ప్రశ్నించగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను అసలు నమ్మకండి. విభజన రాజకీయాలు చేయడంలో ఈ రెండు పార్టీలు ముందుంటాయి. స్థానిక పార్టీకే తమ మద్దతు ఉంటుందని.. ప్రజలు కూడా స్థానిక పార్టీలకే మద్దతు ఇవ్వాలన్నారు. రాహుల్‌ గాంధీని అసలు నమ్మవద్దంటూ కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. బిల్డర్లను భయపెట్టి వారి వద్ద నుంచి డబ్బులు కలెక్ట్‌ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement