శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చతుర్దశి ప.2.47 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: చిత్త రా.12.41 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.6.58 నుండి 8.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు, అమృతఘడియలు: సా.5.31 నుండి 7.16 వరకు, నరకచతుర్దశి, దీపావళి.
మేషం : ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి అవాంతరాలు.
కర్కాటకం: కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు.
కన్య: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొంత అనుకూలత..
తుల: కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.
వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
ధనుస్సు: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
మకరం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
కుంభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మీనం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment