
వీడిన ఎస్పీ సంక్షోభం.. అఖిలేశే మళ్లీ సీఎం
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీలో సుడిగాలి అంతటి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ అధినేత ములాయం పట్టువీడారు. ఆ పార్టీలో సంక్షోభానికి తెరదించారు. తన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఆయన మరోసారి ముఖ్యమంత్రి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించడం జరుగుతుందని తొలుత చెప్పిన ములాయం తాజాగా ఆ విషయాన్ని ఇప్పుడే ప్రకటించేశారు.
చదవండి..(అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు)
వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మరోసారి కూడా తన కుమారుడు అఖిలేశ్ సీఎంగా బాధ్యతలు చేపడతారని అన్నారు. ఇక పార్టీలో చీలిక అనే ప్రశ్న లేదని, సమాజ్ వాది పార్టీ అంతా ఒక్కటేనని, ఎన్నికల ప్రచారంలో దూకుతామని ములాయం సింగ్ అన్నారు. ఎన్నికల్లో విజయం తామే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.