సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ తొలిదశ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ సమాలోచనలు జరిపారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధాని వ్యాఖ్యలు చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక పరిస్థితి తెలుస్తోందన్నారు. అందుకోసమే పాకిస్థాన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. మోదీ.. ప్రధాని పదవి గౌరవాన్ని కాపాడాలని ఆనంద శర్మ సూచించారు. కాంగ్రెస్ నేతలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.
కాగా తనను హతమార్చేందుకు మణిశంకర్ అయ్యర్ కుట్ర పన్నారని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ప్రధాని ఆరోపణలను కాంగ్రెస్, పాకిస్థాన్ తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment